BRS: బీఆర్ఎస్‌కు భారీ షాక్... ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు

high court judgement on brs mlc vithal election
  • 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన విఠల్
  • స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాజేశ్వర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్లు పోర్జరీ దరఖాస్తు
  • తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదంటూ కోర్టును ఆశ్రయించిన రాజేశ్వర్ రెడ్డి
  • రాజేశ్వర్ రెడ్డికి అనుకూలంగా వచ్చిన తీర్పు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికల చెల్లదని హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఆయన ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనకు రూ.50వేల జరిమానాను విధించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది.

దండె విఠల్ ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో ఎన్నికయ్యారు. పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా విఠల్ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజేశ్వర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఫోర్జరీ సంతకాలతో రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు ఇచ్చారు. దీంతో రాజేశ్వర్ రెడ్డ నామినేషన్ ఉపసంహరణకు గురైంది.

అయితే తాను నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అప్పుడే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు. ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని కోరారు. ఆ తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
BRS
TS High Court
BJP
Telangana

More Telugu News