Pothina Mahesh: పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ పోతిన మహేశ్ సంచలన లేఖ

Pothina Mahesh Targets Pawan Kalyan Personal Life
  • పవన్‌కు ఆరు ప్రశ్నలు సంధించిన పోతిన మహేశ్
  • మెగా కుటుంబానికి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదని విమర్శ
  • పిఠాపురంలో ఎన్నో భార్య ప్రచారం చేస్తారని ప్రశ్న
జనసేనాని పవన్ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేత పోతిన మహేశ్ బహిరంగ లేఖ రాశారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపైనా తీవ్ర విమర్శలు చేశారు. లేఖలో ఆరు ప్రశ్నలు సంధించిన మహేశ్.. వాటికి పవన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న పవన్.. వారికి మాత్రం ఏమీ చెయ్యడం లేదని విమర్శించారు. మెగా కుటుంబానికి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదని విమర్శించారు. తన ప్రశ్నలకు పవన్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహేశ్ సంధించిన ప్రశ్నలు ఇవే.

పవన్ ప్రతి పది రోజులకు ఫోన్ నంబర్ ఎందుకు మార్చుతారు? 
ప్రత్యేక హెలికాప్టర్ ఖర్చుల సంగతేంటి? 
పులివెందులలో భారతి, కుప్పంలో భువనేశ్వరి, మంగళగిరిలో బ్రాహ్మణి 
 పిఠాపురంలో పవన్ భార్యల్లో ఎవరు ప్రచారం చేస్తారు? 
 ఎన్నారైలు ఇచ్చిన విరాళాలపై గోప్యత, చిరంజీవి ఇస్తే ప్రచారమా? 
మెగా ఫ్యామిలీ ఒక్క అభిమానికైనా ఒక్క పూట భోజనం పెట్టిందా? 

Pothina Mahesh
Pawan Kalyan
Janasena
YSRCP

More Telugu News