CPI Narayana: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే ముగ్గురవుతారు: సీపీఐ నారాయణ

  • ఇప్పటికే ఝార్ఖండ్, ఢిల్లీ సీఎంలు జైల్లో ఉన్నారన్న నారాయణ 
  • బీజేపీకి అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రులు దొంగలైనా వారు మంచివారేనని ఆగ్రహం
  • రేవంత్ రెడ్డిని జైలుకు పంపించాలని మోదీ చూస్తున్నారని వ్యాఖ్య
CPI Narayana interesting comments on Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే అప్పుడు ముగ్గురు సీఎంలు జైల్లో ఉన్నట్లవుతుందని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారని, ఇప్పుడు తెలంగాణ సీఎంను కూడా పెడితే సరిపోతుందన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రులు దొంగలైనా వారు మంచివారేనని... కానీ ఆ పార్టీని వ్యతిరేకిస్తే మాత్రం జైలుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డినీ జైలుకు పంపించాలని ప్రధాని మోదీ చూస్తున్నారన్నారు.

కానీ దేశద్రోహం కింద మొదట అరెస్ట్ చేయాల్సి వస్తే మోదీని, రెండో వ్యక్తిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నామా నాగేశ్వరరావును మంత్రిగా చేస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్నారని... ఈయనకే దిక్కులేదు కానీ నామాను మంత్రి చేస్తాడట అని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి కార్యకర్త తనను తాను అభ్యర్థిగా భావించుకొని పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

More Telugu News