Devineni Uma: ఈ ప్రజాకంటక చట్టం రద్దుపైనే చంద్రబాబు రెండో సంతకం: దేవినేని ఉమామహేశ్వరరావు

  • ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దేవినేని ఉమా తీవ్ర విమర్శలు
  • దీనివల్ల రైతులు, సామాన్యులు తమ భూములు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన
  • వారి భూములు కబ్జా చేసేందుకే ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిందని ఆరోపణ
Chandra Babu Second Sign On Land Titling Act Cancellation

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. పేద, సాధారణ, మధ్య తరగతి, రైతుల భూములను కబ్జా చేసేందుకే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని నిప్పులు చెరిగారు. కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు పెట్టే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనేనని తెలిపారు.

ల్యాండ్ టైట్లింగ్ చట్టం వల్ల రైతులు, ప్రజలు తమ భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. భూములకు సంబంధించి ఇప్పటి వరకు కోర్టులకు ఉన్న అన్ని అధికారాలను తీసుకెళ్లి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (టీఆర్‌వో) చేతుల్లో పెట్టారని ఆందోళన వ్యక్తంచేశారు. వ్యక్తిగత కక్షలతో గ్రామాల్లో వైసీపీ నాయకులు భూములపై టీఆర్‌వోకు ఫిర్యాదు చేస్తే, ఆయన దానిని డిస్ప్యూట్ రిజిస్టర్‌లో నమోదు చేస్తే దానిపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఈ ప్రజా కంటక భూ హక్కు చట్టం రద్దుపైనే రెండో సంతకం పెడతారని దేవినేని తెలిపారు.

More Telugu News