Venkatesh Daughter: ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న హీరో వెంకటేశ్ కూతురు!

Actor Venkatesh daughter Ashritha election campaign for Congress
  • ఖమ్మం లోక్ సభకు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న రఘురామరెడ్డి
  • హీరో వెంకటేశ్ వియ్యంకుడు రఘురామరెడ్డి
  • రఘురామరెడ్డి తరపున ప్రచారం నిర్వహిస్తున్న వెంకటేశ్ కూతురు అశ్రిత 
యావత్ దేశం ఎన్నికల హడావుడిలో మునిగిపోయింది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. తాజాగా స్టార్ హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత కూడా ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగారు. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి తరపున ఆమె ప్రచారం చేస్తున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు, కాంగ్రెస్ తరపున రఘురామరెడ్డి పోటీ చేస్తున్నారు. 

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విక్టరీ వెంకటేశ్ ల వియ్యంకుడు రఘురామరెడ్డి. ఆయన కోసం వెంకటేశ్ ప్రచారం చేస్తారా? అనే చర్చ నడుస్తోంది. అయితే వెంకటేశ్ కు బదులుగా ఆయన కూతురు అశ్రిత ప్రచారంలోకి దిగారు. పార్టీ కండువా కప్పుకుని ఆమె ప్రచారం చేస్తున్నారు. తన మామ రఘురామరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆమె కోరుతున్నారు.
Venkatesh Daughter
Ashritha
Election Campaign
Khammam
Congress

More Telugu News