Bollywood: కోహ్లీ బాలీవుడ్‌కి అల్లుడు.. అనుష్క‌తో న‌టిస్తున్న స‌మ‌యంలోనే వారి డేటింగ్ గురించి తెలిసింది: షారుఖ్ ఖాన్‌

  • త‌న‌కు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్ట‌మ‌న్న బాలీవుడ్ బాద్‌షా
  • తామిద్ద‌రం ఎక్కువ సేపు క‌లిసి టైం పాస్ చేస్తుంటామ‌ని వ్యాఖ్య‌
  • త‌న సినిమాల్లోని కొన్ని స్టెప్పులు కోహ్లీకి నేర్పిస్తుంటాన‌న్న షారుఖ్‌
Shah Rukh Khan says Virat Kohli is Son In Law of Bollywood

ఎన్నో హిట్ చిత్రాల‌లో నటించి ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఇష్ట‌మైన ఈ త‌రం క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా? ఇంకెవ‌రో కాదు విరాట్ కోహ్లీ. త‌న‌కు కోహ్లీ అంటే చాలా ఇష్ట‌మ‌ని, బాలీవుడ్‌కి అల్లుడిగా అతనిని పేర్కొంటూ ఉంటానని షారుఖ్ స్వ‌యంగా చెప్పారు. 

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. "విరాట్ అంటే నాకు చాలా ఇష్టం. మా ప‌రిశ్ర‌మ‌కు అల్లుడిగా అతనిని అభివ‌ర్ణిస్తుంటాను. ఇత‌ర ఆట‌గాళ్ల‌తో పోలిస్తే త‌న‌తోనే నాకు ప‌రిచ‌య‌మెక్కువ‌. ఎక్కువ సేపు క‌లిసి టైం పాస్ చేస్తుంటాం. అనుష్క‌తో న‌టిస్తున్న స‌మ‌యంలో వారి డేటింగ్ గురించి తెలిసింది. నా సినిమాల్లోని కొన్ని స్టెప్పులు కోహ్లీకి నేర్పిస్తుంటా. ఇటీవ‌ల విడుద‌లైన ప‌ఠాన్ మూవీ టైటిల్ సాంగ్ డ్యాన్స్ నేర్పించా. ఒక‌సారి మైదానంలో ర‌వీంద్ర జ‌డేజాతో క‌లిసి విరాట్ స్టెప్పులు వేయ‌డం చూశా. ఆ స‌మ‌యంలో వారు చాలా వ‌రెస్ట్‌గా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ టైంలో ఆ ఇద్ద‌రితో ఒక‌టే చెప్పాను.. మీకు కొన్ని సిగ్నేచ‌ర్ స్టెప్పులు నేర్పిస్తా.. త‌ర్వాత మీరు వ‌ర‌ల్డ్‌క‌ప్‌, ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఇలా పెద్ద వేదిక‌ల‌పై డ్యాన్స్ చేసేట‌ప్పుడు వాటిని ఫాలో అయితే బాగుటుంది" అని చెప్పిన‌ట్లు షారుఖ్ తెలిపారు. 
    
ఇక విరాట్ కోహ్లీ భార్య న‌టి అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి రబ్ నే బనా ది జోడి (2008), జబ్ తక్ హై జాన్ (2012), ఏ దిల్ హై ముష్కిల్ (2016), జబ్ హ్యారీ మెట్ సెజల్ (2017), జీరో (2018) వంటి చిత్రాలలో షారుఖ్ ఖాన్ న‌టించారు. కాగా, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల వివాహం డిసెంబర్ 11, 2017లో ఇటలీలోని టుస్కానీలో అంగరంగ వైభవంగా జరిగిన విష‌యం తెలిసిందే. దాదాపు ఆరేళ్ల‌పాటు స‌హ‌జీవనం చేసిన తర్వాత ఈ జంట వివాహ బంధంతో ఒక్క‌టయింది. ఈ దంప‌తుల‌కు ఇద్దరు పిల్లలు వామిక, అకాయ్ ఉన్నారు.

More Telugu News