Jagga Reddy: అందుకే ఢిల్లీ పోలీసులు నోటీసులిచ్చారు: జగ్గారెడ్డి

  • ఎన్నికల కమిషన్ డమ్మీగా మారిందని ఆరోపణ
  • రాహుల్ గాంధీ ప్రసంగాలతో బీజేపీకి వణుకు పుడుతోందని వ్యాఖ్య
  • ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చారన్న జగ్గారెడ్డి
Jagga Reddy questions why ec did not send notices to PM Modi

రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఎన్నికల కమిషన్ ఆయనకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ డమ్మీగా మారిందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో రాహుల్ గాంధీ చేస్తోన్న ప్రసంగాలు చూసి బీజేపీకి వణుకు ప్రారంభమైందన్నారు.

 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకం కాదని మోహన్ భగవత్ ప్రకటన చేశారని, ఇందుకు రాహుల్ గాంధీ ప్రసంగమే కారణమన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు తీసుకురావటం కూడా ఇందులో భాగమే అన్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు దీనిని గమనించాలన్నారు. 

మోదీ పదేళ్లు ప్రధానిగా ఉండి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రజలు దృష్టిని ఆకర్షించడంలో భాగంగా అమిత్ షా గీసిన స్కెచ్ లో భాగంగా ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్‌కు వచ్చారని విమర్శించారు. ప్రధానమంత్రి హోదాలో పుస్తేల మీద దిగజారుడు రాజకీయాలు చేసినందుకు బీజేపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News