90 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసిన జియో
- రోజుకు 2 జీబీ.. అదనంగా మరో 20 జీబీ డేటా
- రూ.749 రీఛార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీ
- జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్న టెలికం దిగ్గజం
ఇక ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. 5జీ మొబైల్ కలిగివుండి కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్ యాక్సెస్ ఉంటే అదనపు డేటాను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఆఫర్ కింద జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌లకు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 90 రోజులపాటు ఈ సేవలను పొందవచ్చు.
కాగా తక్కువ రేటుతో సాధ్యమైనన్ని గరిష్ఠ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా జియో ఇటీవలే రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అనేక వర్గాలుగా విభజించింది. అందులో భాగంగా ఈ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా భారత్‌లో అత్యధికంగా 45 కోట్లకు పైగా క్రియాశీల కస్టమర్లను జియో కలిగివుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్‌గా జియో కొనసాగుతోంది.