Telangana: రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారంటూ హైదరాబాద్‌లో ఫిర్యాదు

Case Registered After Doctored Amit Shah Video On Reservation Goes Viral
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి
  • వీడియో మార్ఫింగ్ చేశారంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసిన బీజేపీ నాయకులు
  • ఢిల్లీలోనూ కేసు నమోదు చేసిన స్పెషల్ సెల్ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేశారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలంటూ ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఎవరో వీడియోను మార్ఫింగ్ చేశారంటూ వివిధ రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు కేసులు నమోదు చేశారు. ఢిల్లీలోనూ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు తెలంగాణలోనూ బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana
Amit Shah
BJP

More Telugu News