Virat Kohli: అప్పుడు సిక్స్ కొట్టకపోవడమే మంచిదైంది.. జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌పై కోహ్లీ కామెంట్

Was Pissed Off Virat Kohlis Admission In Candid Dressing Room Conversation With Will Jacks
  • నిన్న ఐపీఎల్ మ్యాచ్‌లో జీటీపై ఆర్సీబీ సంచలన విజయం
  • విల్ జాక్స్‌ సెంచరీతో సులువుగా 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ
  • గెలుపునకు ముందు ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ కోట్టనందుకు విరాట్‌కు చిరాకు
  • అదే ఓవర్ చివర్లో విల్ జాక్స్ 94 స్కోర్ వద్ద సిక్స్ కొట్టి సెంచరీ చేసినందుకు హర్షం
  • మొదట్లో తాను సిక్స్ కొట్టకపోవడం మంచిదైందని కామెంట్

నిన్నటి గుజరాత్ టైటన్స్‌తో (జీటీ) ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీం సంచలన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఛేదనలో అదరగొట్టింది. విల్ జాక్స్ సెన్సేషనల్ సెంచరీకి విరాట్ బ్యాటింగ్ కూడా తోడవడంతో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు ఓవర్లు మిగిలుండగానే గెలుపు సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. కేవలం 41 బంతుల్లో విల్ జాక్స్ సెంచరీ పూర్తి చేసుకోగా విరాట్ 70 పరుగులతో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. 

ఈ విజయంతో ఆర్సీబీ డ్రెస్సింగ్ రూంలో సంతోషం అంబరాన్ని అంటింది. ఇక జాక్స్ సెంచరీపై కోహ్లీ కామెంట్స్ కూడా వైరల్‌గా మారాయి. 16వ ఓవర్‌లో తొలి బంతిలో సిక్స్ కొట్టనందుకు తనకు చిరాకెత్తిందని విరాట్ జాక్స్‌తో వ్యాఖ్యానించాడు. కానీ, ఆ ఓవర్ చివర్లో జాక్స్ స్కోర్ 94 ఉండగా విజయానికి ఇంకా ఒక పరుగు అవసరం పడిందని చెప్పాడు. అప్పుడు జాక్స్ సిక్స్ బాదడం చూశాక తను మొదట్లో సిక్స్ కొట్టక పోవడం మంచిదే అయ్యిందని వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను ఆర్సీబీ నెట్టింట పంచుకోవడంతో ఇది వైరల్‌గా మారింది.  కాగా, 31 బంతుల్లో తొలి అర్ధ సెంచరీ చేసి జాక్స్ ఆ తరువాత 10 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. జాక్స్ వరుస సిక్సుల వెనుకున్న కారణాన్ని కూడా విరాట్ చెప్పుకొచ్చాడు. ‘‘అతడు రెండు రన్స్ తీద్దామన్నాడు. నేను మూడో రన్ కోసం చూశా. ఇలా వికెట్ల పరుగులు తీయలేక జాక్స్ చివరకు సిక్స్‌లు కొట్టేందుకు డిసైడయ్యాడు. అతడి సిక్సుల వెనుకున్న అసలు సీక్రెట్ అది అని చెప్పుకొచ్చాడు. 

Virat Kohli
GT Vs RCB
IPL 2024
Viral Videos
Will Jacks

More Telugu News