Ranbir Kapoor: రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫొటోలు లీక్

Ranbir Kapoor and Sai Pallavi photos from Ramayan sets leaked
  • బాలీవుడ్ లో తెరకెక్కుతున్న 'రామాయణం'
  • రాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లవి
  • ఎలాంటి అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా మొదలైన షూటింగ్
రామాయణం కథాంశంగా ఇప్పటికే అన్ని భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. బాలీవుడ్ లో 'రామాయణం' సినిమాను నిర్మిస్తున్నారు. ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా 'దంగల్'ను తెరకెక్కించిన దర్శకుడు నితేశ్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించినప్పటికీ... తాజాగా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండానే సినిమా షూటింగ్ ను సైలెంట్ గా మొదలు పెట్టారు. 

ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. షూటింగ్ సెట్ లో ఈ ఫొటోలను ఎవరో తీశారు. ఈ ఫొటోల్లో సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్ కపూర్ ముస్తాబై ఉన్నారు. ఒక ఫొటోలో రాముడి గెటప్ లో ఉన్న రణబీర్ కపూర్... పైన ఒక ఫుల్ కోట్ వంటిది వేసుకుని కారావాన్ నుంచి వెళ్తున్నట్టు ఉంది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీత పాత్రలో సాయి పల్లవి చాలా అందంగా ఉందని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు.
Ranbir Kapoor
Sai Pallavi
Ramayan
Bollywood
Photos

More Telugu News