Vampire Facial: ఓ స్పాలో ‘రక్త పిశాచ’ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు హెచ్ఐవీ!

  • న్యూ మెక్సికోలో ఘటన
  • చవక కావడంతో పెరిగిన ఆదరణ
  • చేతి నుంచి రక్తం తీసి ప్లేట్‌లెట్లు వేరు చేసి దానితో ఫేషియల్
  • 2018లోనే వెలుగు చూసిన తొలికేసు
At Least 3 Women Contracted HIV After Getting Vampire Facial At Spa

న్యూ మెక్సికోలో ఓ స్పాలో ‘రక్త పిశాచ’ ఫేషియల్‌ను చేయించుకున్న ముగ్గురు మహిళలు హెచ్ఐవీ బారిన పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రక్త పిశాచ ఫేషియల్ (వాంపైర్ ఫేషియల్) అనేది మెక్సికోలో చాలా పేరు పొందింది. ఇది చాలా చవక. ఫేసియల్ సమయంలో ఓ వ్యక్తి చేతి నుంచి రక్తం తీసి, అందులోంచి ప్లేట్‌లెట్లను వేరు చేస్తారు. ఆ తర్వాత దానిని మైక్రోనీడిల్స్‌ (సూక్ష్మ సూదులు)ను ఉపయోగించి రోగి ముఖానికి పూస్తారు. ఇది చాలా చవక కావడంతో దీనికి ఆదరణ పెరుగుతోంది. అయితే, అపరిశుభ్ర వాతావరణంలో చేసే ఈ ప్రక్రియ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్స్‌ ప్రకారం.. ఇటీవల ఈ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలు హెచ్ఐవీ బారినపడే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో ఇలానే వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న చాలామంది హెచ్ఐవీ బారినపడినట్టు తేలింది. దీంతో ఆ స్పాలను మూసివేశారు. 2018లో ఇందుకు సంబంధించిన తొలి కేసు నమోదైంది. ఓ మధ్యవయస్కురాలైన మహిళ హెచ్ఐవీ బారినపడింది. ఆమెకు డ్రగ్స్ అలవాటు కానీ, హెచ్ఐవీ కలిగిన వ్యక్తులతో లైంగిక సంబంధాలు కానీ లేవు. రక్తమార్పడి కూడా చేయించుకోలేదు. అయినప్పటికీ ఈ ఫేషియల్ తర్వాత ఆమె హెచ్ఐవీకి గురైంది.

More Telugu News