Nagababu: సాగర్... నీకు మా అమ్మ ఆశీస్సులతో పాటు మా అన్నదమ్ముల మద్దతు కూడా ఉంటుంది: నాగబాబు

Nagababu blesses Sagar all the best fir his new movie The 100

  • మొగలిరేకులు సాగర్ హీరోగా 'ది 100' చిత్రం
  • నేడు టీజర్ రిలీజ్ చేసిన మెగా మాతృమూర్తి అంజనాదేవి
  • సాగర్ కు, చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన నాగబాబు
  • ఏపీలో జనసేన స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్న సాగర్

'మొగలిరేకులు' సీరియల్ ఫేమ్ సాగర్ తాజాగా నటించిన చిత్రం 'ది 100'. క్రియా ఫిల్మ్ కార్పొరేషన్, ధమ్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సాగర్ ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఇవాళ మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. దీనిపై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు స్పందించారు. 

"సాగర్... మా అమ్మ అంజనమ్మ గారు లాంచ్ చేసిన నీ 100 మూవీ టీజర్ చూశాను. టీజర్ చాలా బాగుంది. మా అమ్మ ఆశీస్సులతో పాటు మా అన్నదమ్ముల మద్దతు కూడా ఎప్పుడూ నీకు ఉంటుంది. ఆల్ ది బెస్ట్" అంటూ నాగబాబు ట్వీట్  చేశారు. 'ది 100' చిత్ర టీజర్ వీడియోను కూడా పంచుకున్నారు. 

సాగర్ హీరోగా వస్తున్న 'ది 100' చిత్రానికి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాగర్ సరసన మిషా నారంగ్, ధన్యా బాలకృష్ణన్ నటిస్తున్నారు. దొంగ దొంగ ఫేమ్ ఆనంద్, గిరిధర్, లక్ష్మీ గోపాల్ స్వామీ, కల్యాణి నటరాజన్, జయంత్, యాంకర్ విష్ణు ప్రియ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

సాగర్... కొన్నాళ్ల కిందట జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సాగర్ జనసేన ప్రచార సారథిగా వ్యవహరించారు. అంతేకాదు, ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ గానూ నియమితుడయ్యారు.

Nagababu
Sagar
The 100
Teaser
Anjanadevi
Janasena
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News