Manda Krishna Madiga: కావ్య గెలుపు కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు: కడియం శ్రీహరిపై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆరోపణలు

Manda Krishna Madiga serious alleations on Kadiam Srihari
  • ఒక్కో ఓటుకు రూ.5వేల నుంచి రూ.10వేలు ఇవ్వబోతున్నారని ఆరోపణ
  • అక్రమ సంపాదన డబ్బుతో కూతురును గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న మంద కృష్ణ
  • కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం శ్రీహరికి భారీగా డబ్బులు అందాయని ఆరోపణ
అక్రమంగా వందల కోట్ల రూపాయలు సంపాదించిన కడియం శ్రీహరి, ఆ డబ్బుతో తన కూతురు కడియం కావ్యను వరంగల్ లోక్ సభ స్థానం నుంచి గెలిపించేందుకు ఉపయోగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఒక్కో ఓటుకు రూ.5వేల నుంచి రూ.10వేలు ఇవ్వబోతున్నారన్నారు. కూతురు కోసం రూ.100 కోట్లు ఖర్చు పెట్టనున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో అవినీతిపరుడైన కడియంను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం శ్రీహరికి భారీగా డబ్బులు అందాయని ఆరోపించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో తన కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ నుంచి టిక్కెట్ తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడారు. తనకు స్థానిక నాయకుల నుంచి సహకారం లేదంటూ కావ్య టిక్కెట్‌ను తిరస్కరించి.. పార్టీని వీడారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ టిక్కెట్ పొందారు. బీఆర్ఎస్ వరంగల్ నుంచి సుధీర్ మాదిగను అభ్యర్థిగా ప్రకటించింది.
Manda Krishna Madiga
Kadiam Srihari
BRS
BJP
Lok Sabha Polls

More Telugu News