సన్ రైజర్స్ టార్గెట్ 207 రన్స్...56 పరుగులకే 4 వికెట్లు డౌన్
- హైదరాబాదులో సన్ రైజర్స్ × ఆర్సీబీ
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు
- రాణించిన కోహ్లీ, పాటిదార్, గ్రీన్
అనంతరం 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ ట్రావిస్ హెడ్ తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు. కేవలం 1 పరుగు చేసిన హెడ్... పార్ట్ టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్ లో షాట్ కొట్టే ప్రయత్నంలో అవుటయ్యాడు.
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతూ 13 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అభిషేక్ 3 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. పేసర్ యశ్ దయాళ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత కాసేపటికే ఐడెన్ మార్ క్రమ్ (7) కూడా వెనుదిరగడంతో సన్ రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. క్లాసెన్ వచ్చీ రావడంతోనే ఓ సిక్స్ బాదాడు. మరో సిక్స్ కొట్టే యత్నంలో అవుటయ్యాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోరు 5 ఓవర్లలో 4 వికెట్లకు 56 పరుగులు.