Thotapalli Madhu: నాకు మనుషులంటే భయం: రచయిత తోటపల్లి మధు

  • దాసరి గారి సినిమాలకు ఎక్కువగా రాశానన్న మధు  
  • సెట్స్ కి వెళ్లే అలవాటు తనకి లేదని వివరణ 
  • తనకి ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదని స్పష్టీకరణ

Thotapalli Madhu Interview

రచయితగా తోటపల్లి మధుకి మంచి పేరుంది. ఆయన సంభాషణలు సమకూర్చిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. తాజాగా ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. "తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి పాతికవేలు తీసుకున్నది సత్యానంద్ గారి తరువాత నేనే. ఆ రోజుల్లో దాసరి గారితో కలిసి ఎక్కువ సినిమాలకి పనిచేశాను"  అన్నారు.

"దాసరి గారి సినిమాకు తప్పించి నేను సెట్స్ కి వెళ్లేవాడిని కాదు. హోటల్లో కూర్చుని రాసేవాడిని. ఏ సినిమాకి కూడా మూడు రోజులకు మించి సంభాషణలు రాయలేదు. నేను సెట్స్ కి ఎందుకు వెళ్లనంటే నాకు మనుషులంటే భయం. నేను ఎవరితోను ఎక్కువగా మాట్లాడను .. నాతో చర్చలు ఉంటాయేగానీ, వాదోపవాదాలు ఉండవు .. అవి నాకు నచ్చవు" అని చెప్పారు. 

" నేను డబ్బులు ముందుగా తీసుకుంటాను .. ఎందుకంటే రేపొద్దున ఇక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. నాకు ఇక్కడ ఎదురైన అనుభవాలు అలాంటివి. నేను ఎక్కువగా కాలక్షేపానికి కబుర్లు చెబుతూ కూర్చోకపోవడంతో, 'నువ్వేంటయ్యా అలా వెళ్లిపోతావ్ .. నాతో పనిచేయడమే ఒక ఎడ్యుకేషన్ అంటారు చాలామంది' అని ఒకసారి దాసరిగారు అన్నారు. 'సార్ .. మిమ్మల్ని పొగిడేవారు తక్కువనా? మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు .. మీరు అప్పగించిన పని పూర్తిచేయాలిగదా' అంటూ వెళ్లిపోయేవాడిని" అని అన్నారు.

More Telugu News