Jonnavithula: విజయవాడ సెంట్రల్ స్థానానికి నామినేషన్ వేసిన టాలీవుడ్ పాటల రచయిత

Tollywood lyric writer Jonnavithula files nomination from Vijayawada Central

  • గతేడాది జై తెలుగు పార్టీ స్థాపించిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
  • తెలుగు భాష పరిరక్షణే అజెండా
  • నిన్న నామినేషన్ పత్రాల సమర్పణ 

ఏపీలో ఎన్నికల సంరంభం కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్ల హడావిడిలో ఉన్నారు. ఇవాళ నామినేషన్లకు ఆఖరి రోజు. ఈ సందట్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

టాలీవుడ్ సీనియర్ గీత రచయిత, పండితుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కూడా ఏపీ ఎన్నికల బరిలో దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి నిన్న నామినేషన్ దాఖలు చేశారు. జొన్నవిత్తుల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

జొన్నవిత్తుల గతేడాది జూన్ లో 'జై తెలుగు పార్టీ' పేరిట ఓ పార్టీ స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. నేతలను, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే పార్టీ పెడుతున్నట్టు ఆ సందర్భంగా వివరించారు. అంతేకాదు, తెలుగు భాషకు పునర్ వైభవం తీసుకురావాలన్నది తన లక్ష్యమని, తెలుగు భాష పరిరక్షణ అజెండాగా వచ్చే ఎన్నికల బరిలో దిగుతానని జొన్నవిత్తుల అప్పట్లోనే ప్రకటించారు.

Jonnavithula
Nomination
Vijayawada Central
Jai Telugu Party
Lyric Writer
Tollywood
  • Loading...

More Telugu News