T20 World Cup: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కి కెప్టెన్‌గా రోహిత్ అవ‌స‌రం లేద‌న్న క్రికెట్ అన‌లిస్ట్.. ఫ్యాన్స్‌ ఫైర్‌!

Rohit Sharma is not the Captain that India needed in this T20 World Cup says Joy Bhattacharjya
  • 'క్రిక్‌బ‌జ్' కార్య‌క్ర‌మంలో నోరు జారిన‌ క్రికెట్ అన‌లిస్ట్ జోయ్ భ‌ట్టాచార్య 
  • ఇప్పుడు రోహిత్ ఫామ్‌లో లేడు.. జ‌ట్టులోకి తీసుకోవ‌డం క‌రెక్ట్ కాద‌న్న క్రికెట్ అన‌లిస్ట్ 
  • తానైతే జస్ప్రీత్ బుమ్రాకు టీమిండియా కెప్టెన్సీ అప్ప‌గించేవాడినంటూ వ్యాఖ్య‌
  • రోహిత్ లేకుండా భార‌త్ బ‌రిలోకి దిగితే అంతే సంగ‌తులు అంటున్న హిట్‌మ్యాన్ అభిమానులు
ఈ ఏడాది జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కి కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌ అవ‌స‌రం లేద‌ని క్రికెట్ అన‌లిస్ట్ జోయ్ భ‌ట్టాచార్య అభిప్రాయ‌ప‌డ్డారు. "రోహిత్ మంచి క్రికెటర్‌. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు అత‌డు ఫామ్‌లో లేడు. అత‌నికంటే య‌శ‌స్వి జైస్వాల్‌, విరాట్ కోహ్లీ లాంటివారు మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు. అత‌డిని సార‌ధిగా ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల జ‌ట్టులో ఒక స్థానం ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. నేనైతే జస్ప్రీత్ బుమ్రాకు టీమిండియా సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించేవాడిని" అని చెప్పుకొచ్చారు. 'క్రిక్‌బ‌జ్' నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జోయ్ భ‌ట్టాచార్య ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై హిట్‌మ్యాన్ అభిమానులు మండిప‌డుతున్నారు. రోహిత్ లేకుండా భార‌త్ బ‌రిలోకి దిగితే అంతే సంగ‌తులు అని కామెంట్ చేస్తున్నారు. 

ఇదిలాఉంటే.. జూన్ 2 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు తెర లేవ‌నుంది. ఈ ఐసీసీ టోర్నీకి వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నాయి. మొత్తం 20 జ‌ట్లు, 5 గ్రూపులుగా విడిపోయి బ‌రిలోకి దిగనున్నాయి. గ్రూప్‌-ఏలో భార‌త్‌తో పాటు కెన‌డా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. ఇక టోర్నీలోనే హైఓల్టేజీ మ్యాచ్ అయిన టీమిండియా, పాకిస్థాన్ పోరుకు న్యూయార్క్ వేదిక కానుంది. జూన్ 9వ తేదీన ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.
T20 World Cup
Rohit Sharma
Joy Bhattacharjya
Team India
Cricket
Sports News

More Telugu News