తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల
- ఫస్ట్ ఇయర్‌లో 2.87 లక్షల మంది ఉత్తీర్ణత
- సెకండ్ ఇయర్‌లో 3.22 లక్షల మంది పాస్
- ప్రథమ సంవత్సరంలో 60.01 శాతం ఉత్తీర్ణత నమోదు
- ద్వితీయ సంవత్సరంలో 64.18 శాతం మంది ఉత్తీర్ణత
ఫస్ట్ ఇయర్‌లో రంగారెడ్డి జిల్లా 71.07 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, సెకండ్ ఇయర్‌లో ములుగు 82.95 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 4.78 లక్షల మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉంటే.. 4 లక్షలకు పైగా ద్వితీయ సంవత్సరం స్టూడెంట్స్ ఉన్నారు.