Vijay Deverakonda: తన బాడీ గార్డ్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda attends the wedding reception with his body guard

  • తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వెళ్లిన యంగ్ హీరో
  • నూతన దంపతులతో ఫొటోకి పోజులు
  • విజయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల తన పర్సనల్ సెక్యూరిటీ గార్డు రవి వివాహానికి హాజరయ్యాడు. హైదరాబాద్‌లో వివాహం జరగగా తన తల్లిదండ్రులను వెంటబెట్టుకొని రిసెప్షన్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నూతన వధూవరులతో విజయ్ ఫొటోలు కూడా దిగాడు. బ్లూ కలర్ షర్ట్, పసుపు రంగు ప్యాంటు, టోపీ ధరించిన మెరిసిపోయాడు. శాలువా కప్పి విజయ్‌ని ఆహ్వానిస్తున్న మరో ఫొటో కూడా చక్కర్లు కొడుతోంది.

కాగా తన సెక్యూరిటీ గార్డు వివాహానికి హాజరైన విజయ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సింప్లిసిటీ ఉన్న నటుడు అంటూ కొనియాడుతున్నారు. ‘రియల్ హీరో’ అంటూ ఓ అభిమాని మెచ్చుకున్నాడు. ‘ఒదిగి ఉంటాడు’ అని మరో అభిమాని వ్యాఖ్యానించాడు. 'విజయ్ సార్, మీకు రెస్పెక్ట్ ఉంది' అని మరో యూజర్ రాసుకొచ్చాడు.

కాగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విజయ్ మెప్పించాడు. మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. కాగా విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రంలో పోలీస్ పాత్రలో నటించనున్నాడని సమాచారం.

More Telugu News