Pawan Kalyan: సజ్జలా... చిరంజీవి జోలికి రావొద్దు: పవన్ కల్యాణ్ వార్నింగ్

  • ఉప్పాడలో పవన్ పవర్ ఫుల్ ప్రసంగం
  • ప్రభుత్వ సలహాదారు సజ్జలపై విమర్శలు
  • చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలన్న పవన్
Pawan Kalyan warns Sajjala

సజ్జలా... చిరంజీవి జోలికి రావొద్దు... చిరంజీవి పద్మవిభూషణ్ గ్రహీత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత... అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు... అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఘాటుగా హెచ్చరించారు. సజ్జలా... ఆధిపత్య ధోరణి మంచిది కాదు... చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. 

వైసీపీ వాళ్లు రేబీస్ వచ్చిన కుక్కల్లా తయారయ్యారని, తమను తోడేళ్లు అంటున్నవారు రేబీస్ వచ్చిన కుక్కలు అని విమర్శించారు. 

"నేను వ్యక్తిగత స్వార్థం చూసుకుని ఉంటే ఇవాళ వైసీపీ నీచుల చేత నా భార్యను తిట్టించుకునేవాడిని కాను... నేను ప్రజల కోసం పోరాడుతున్నాను... నేను ఎంత ప్రయత్నించినా నా నోటి వెంట "భారతీ గారు" అనే మాటే వస్తోంది... ఆమెను ఒక్క మాట కూడా అనలేకపోతున్నాను... అది నా సంస్కారం. ప్రజల కోసం నేను మాటలు పడుతున్నాను" అని పవన్ కల్యాణ్ వివరించారు.

  • Loading...

More Telugu News