Barrelakka: నాగర్ కర్నూల్ లోక్ సభ నుంచి ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

Barrelakka files nomination for NagarKurnool Lok sabha
  • స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క
  • రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద నామినేషన్ పత్రాలు సమర్పించిన శిరీష
  • గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శిరీష
నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి శిరీష అలియాస్ బర్రెలక్క స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్‌కు ఆమె నామినేషన్ పత్రాలను అందించారు. శిరీష గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె పోటీ చేయడం అప్పుడు సంచలనంగా మారింది.

సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే కేవలం 5 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించారు. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు నిలిచారు.
Barrelakka
Nagarkurnool District
Lok Sabha Polls

More Telugu News