Stone Attack On Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసు: నిందితుడి కస్టడీ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా

Judgment on custody petition of accused adjourned till tomorrow
  • సీఎం జగన్ పై ఏప్రిల్ 13న విజయవాడలో రాయితో దాడి
  • ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిందితుడి కస్టడీ కోరుతూ విజయవాడ కోర్టులో పోలీసుల పిటిషన్
  • కౌంటర్ దాఖలు చేసిన నిందితుడి తరఫు న్యాయవాది
సీఎం జగన్ పై ఏప్రిల్ 13న విజయవాడలో రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నిందితుడిని కస్టడీకి కోరుతూ పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. నిందితుడ్ని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ముగిసింది. నిందితుడి తరఫు న్యాయవాది సలీం కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం పూర్తి తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.
Stone Attack On Jagan
Vijayawada
Coourt
Police
YSRCP

More Telugu News