Grandhi Srinivas: పవన్ ను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలి: గ్రంధి శ్రీనివాస్

Pawan Kalyan has to be admitted in hospital says Grandhi Srinivas
  • కార్లను మార్చినట్టు పెళ్లాలను మారుస్తున్నారంటూ గ్రంధి శ్రీనివాస్ ఫైర్
  • వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శ
  • పవన్ ను చూస్తే ఎవరు రౌడీనో అర్థమవుతుందని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మానసిక స్థితి సరిగా లేదని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పవన్ కు నిలకడ లేదని చెప్పారు. తక్షణమే ఆయనను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. సినీ గ్లామర్ తో కార్లను మార్చినట్టు... భార్యలను పవన్ మారుస్తున్నారని విమర్శించారు. హిందూ వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించేలా పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలను ఇచ్చారని విమర్శించిన పవన్... ఇప్పుడు బీజేపీతో కలిసిపోయారని విమర్శించారు. 

కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించిన గూండాలతో జతకట్టిన పవన్... భీమవరంలో గూండాలు, రౌడీలు, బాంబుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రెచ్చిపోతూ మాట్లాడుతున్న పవన్ ను చూస్తే ఎవరు రౌడీనో అర్థమవుతుందని అన్నారు. పవన్ గురించి అందరికీ తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో భీమవరంలో చిత్తుగా ఓడించారని చెప్పారు. ఎమ్మెల్యేగా భీమవరంలో తాను ఎన్నో అభివృద్ధి పనులు చేయించానని తెలిపారు. 
Grandhi Srinivas
YSRCP
Pawan Kalyan
Janasena
Bhimavaram

More Telugu News