Revanth Reddy: నేను హిందువును... దేవుడిని నమ్ముతాను... అలాంటి వాడే నిజమైన హిందువు: రేవంత్ రెడ్డి

  • ఎవరి ధర్మం వారిది... ఎవరైనా పరస్పరం గౌరవించుకోవాలన్న ముఖ్యమంత్రి
  • దేవుడి పేరుతో రాజకీయం చేసే వారిని పొలిమేర దాకా తరిమికొడదామని పిలుపు
  • దేవుడు గుడిలో ఉండాలి... భక్తి గుండెల్లో ఉండాలి... అదే నిజమైన హిందుత్వమన్న రేవంత్ రెడ్డి
I am Hindu I belived in god revanth reddy

'నేను హిందువును... దేవుడిని నమ్ముతాను... ముస్లింలు మహమ్మద్ ప్రవక్తను, క్రైస్తవులు ఏసుక్రీస్తును, సిక్కులు వారి దేవుడిని నమ్ముతారు... ఎవరి ధర్మం వారిది... ఎవరైనా పరస్పరం గౌరవించుకోవాలి... దేవుడి పేరుతో రాజకీయం చేసే వారిని పొలిమేర దాకా తరిమికొడదాం' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రాజస్థాన్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ఓ వర్గానికి పంచిపెడతారని మాట్లాడటం సరికాదన్నారు.

శ్రీరాముడి భక్తుడిగా మనం భద్రాచలం వెళ్లి రాముడిని కొలిచామని... జోగులాంబ అమ్మవారిని పూజించామని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ బీజేపీ వారికి మాత్రం జైశ్రీరాం అనాలంట... బూతులో ఓట్లు పడాలంట అని విమర్శలు గుప్పించారు. బీజేపీకి దెయ్యం పట్టినట్లు ఉందని మండిపడ్డారు. రాముడి పేరుతో ఇంకా ఎంతకాలం రాజకీయం చేస్తారు? అని నిలదీశారు.

తాను బీజేపీని ఒక్కటే అడుగుతున్నానని... రాముడిని బజారులో పెట్టడం.... గోడల మీద రాయడం... ఇదేనా మీ నీచ రాజకీయం? అని నిలదీశారు. దేవుడు గుడిలో ఉండాలి... భక్తి గుండెల్లో ఉండాలన్నారు.. అలాంటి వాడే నిజమైన హిందువు అవుతాడని వ్యాఖ్యానించారు. ఓ వైపు ఆకలి సూచీలో భారత్ 111వ స్థానంలో ఉందని విమర్శించారు. ఇందుకు ప్రధాని మోదీ సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

More Telugu News