Kuwait: కువైట్ లో హిందీ రేడియో ప్రసారాల ప్రారంభం

  • కువైట్ లో ఉంటున్న దాదాపు 10 లక్షల మంది భారతీయులు
  • తొలిసారి హిందీ రేడియో ప్రసారాలను ప్రారంభించిన కువైట్
  • కువైట్ పై ప్రశంసలు కురిపించిన భారత రాయబార కార్యాలయం
Hindi radio program started in Kuwait

చాలా కాలంగా ఇండియా - కువైట్ దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది భారతీయులు కువైట్ లో పని చేస్తున్నారు. మరోవైపు కువైట్ లో తొలిసారి హిందీ రేడియో ప్రసార కార్యక్రమాలు మొదలయ్యాయి. దీనిపై భాతర రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. 

ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఎఫ్ఎం 93.3, ఎఫ్ఎం 96.3 ఫ్రీక్వెన్సీల్లో హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయని తెలిపింది. హిందీ కార్యక్రమాలను ప్రసారం చేయడంపై కువైట్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖపై భారత రాయబార కార్యాలయం ప్రశంసలు కురిపించింది. కువైట్ రేడియోలో హిందీ ప్రసారాలు ప్రారంభం కావడం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగు పర్చుకోవడంలో కీలకంగా మారబోతున్నాయని తెలిపింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు పూర్తి కావొస్తోందని వెల్లడించింది.

More Telugu News