హిందువుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ అగరబత్తిపై కూడా జీఎస్టీ వేసింది: మంత్రి సీతక్క
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం లేదనే బీఆర్ఎస్‌ను ప్రజలు పక్కన పెట్టారని వ్యాఖ్య
- గ్యారెంటీలకే గ్యారెంటీ రేవంత్ రెడ్డి అన్న మంత్రి సీతక్క
- కాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిందన్న మంత్రి
కాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. జీఎస్టీ తీసుకువచ్చి రూ.54 లక్షల కోట్లను పేదల నుంచి వసూలు చేశారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు పదేళ్లలో కూడా నెరవేరలేదన్నారు. జన్ ధన్ ఖాతాలో డబ్బులు వేశారా? అని సీతక్క నిలదీశారు.