Nara Lokesh: తప్పుడు కేసులు పెట్టి వేధించిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తాం: నారా లోకేశ్‌

  • వైసీపీ పాలనలో వేలాది మంది యువతులు అదృశ్యమయ్యారన్న లోకేశ్
  • వారి ఆచూకీ కనుక్కుని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని హామీ
  • ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తామన్న లోకేశ్ 
We will remove the officers who have been harassed by filing false cases says Nara Lokesh

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువతులు అదృశ్యమయ్యారని... తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిస్ అయిన యువతుల ఆచూకీ కనుక్కుని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని... తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై న్యాయ విచారణ జరిపిస్తామని, తప్పు చేసిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 

తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు అందిస్తామని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలి పోకుండా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను చట్టబద్ధం చేస్తామని అన్నారు. మంగళగిరి మండలం కాజాలోని ఏఆర్ అపార్ట్ మెంట్ వాసులతో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News