Viral Video: గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

Kid Travels Over 100 Kms While Sitting Between Tyres Of Goods Train
  • ఉత్తరప్రదేశ్‌లో ఘటన
  • ఆడుకుంటూ ఆగిన గూడ్స్ రైలు కిందికి చేరిన బాలుడు
  • అదే సమయంలో రైలు కదలడంతో ఇరుక్కుపోయిన వైనం
  • ఏకబిగిన వంద కిలోమీటర్లు ప్రయాణించి హర్దోయ్ స్టేషన్‌లో ఆగిన రైలు
  • జాగ్రత్తగా బాలుడిని బయటకు తీసి చైల్డ్ కేర్ సెంటర్‌కు తరలించిన ఆర్పీఎఫ్ సిబ్బంది

గూడ్స్ రైలు చక్రాల మధ్యనున్న స్థలంలో ఇరుక్కుపోయిన బాలుడు దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణించిన భయంకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రైల్వే ట్రాక్ పక్కనే ఓ కుటుంబం నివసిస్తోంది. పదేళ్లలోపు ఉండే వారి కుమారుడు ఆడుకుంటూ తమ నివాసానికి ఎదురుగా ఆగివున్న గూడ్సురైలు కిందికి వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికే రైలు కదలడంతో బయటకు రాలేక చక్రాల మధ్య ఉండే ఖాళీ స్థలంలో కూర్చుండిపోయాడు. అలా కదిలిన రైలు ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించి యూపీలోని హర్దోయ్ స్టేషన్‌కు చేరుకుంది.

రైలు సిబ్బంది తనిఖీ చేస్తుండగా బాలుడిని చూసి షాకయ్యారు. వారు వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి బాలుడిని జాగ్రత్తగా బయటకు తీశారు. అనంతరం హర్దోయ్‌లోని చైల్డ్‌కేర్ సెంటర్‌కు తరలించారు. బాలుడి కుటుంబం లక్నో-అలంనగర్ రాజాజీపూర్‌లోని బాలాజీ మందిర్‌లో నివసిస్తున్నట్టు విచారణలో తెలిసింది.

  • Loading...

More Telugu News