Rohit Sharma: రోహిత్ శ‌ర్మకు ముద్దు పెట్ట‌బోయిన షేన్ బాండ్‌.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో మీరే చూడండి..!

Rohit Sharma hilarious reaction after Shane Bond cheeky kiss attempt
  • నేడు జైపూర్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ్యాచ్‌
  • స‌వాయి మాన్‌సింగ్ స్టేడియంలో ఇరుజ‌ట్ల ప్లేయ‌ర్ల ప్రాక్టీస్‌
  • ఆ స‌మ‌యంలో వెన‌క వైపు నుంచి హిట్‌మ్యాన్ వ‌ద్ద‌కు వ‌చ్చి ముద్దు పెట్ట‌బోయిన షేన్ బాండ్‌
  • ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డ రోహిత్.. ఆ త‌ర్వాత న‌వ్వుకున్న వైనం
  • గ‌తంలో ఎంఐకి కూడా బౌలింగ్ కోచ్‌గా ప‌ని చేసిన కివీస్ మాజీ పేస‌ర్‌
  • దాంతో ఆ జ‌ట్టు ఆట‌గాళ్ల‌తో ఆయ‌న‌కు మంచి స్నేహం
ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ), రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) ఆట‌గాళ్ల ప్రాక్టీస్ సెష‌న్‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. జైపూర్ వేదిక‌గా ఇవాళ జ‌రిగే మ్యాచులో ఈ రెండు జ‌ట్లు త‌లప‌డ‌నున్నాయి. దీంతో స‌వాయి మాన్‌సింగ్ స్టేడియంలో ఇరుజ‌ట్ల ప్లేయ‌ర్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రోహిత్ శ‌ర్మ అంద‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తుండ‌గా, రాజ‌స్థాన్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వెనక నుంచి హిట్‌మ్యాన్ వ‌ద్ద‌కు వ‌చ్చి ముద్దు పెట్ట‌బోయాడు. 

ఇది చూసి ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డ రోహిత్ త‌ర్వాత న‌వ్వుకున్నాడు. అనంత‌రం ఇరువురూ స‌ర‌దాగా మాట్లాడుకున్నారు. ఇలా రోహిత్‌ను స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించిన షేన్ బాండ్ తాలూకు వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. కాగా, ఈ న్యూజిలాండ్ మాజీ పేస‌ర్ గ‌తంలో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు కూడా బౌలింగ్ కోచ్‌గా ప‌ని చేశాడు. దాంతో ఆ జ‌ట్టు ఆట‌గాళ్ల‌తో ఆయ‌న‌కు మంచి స్నేహం ఉంది.
Rohit Sharma
Shane Bond
IPL 2024
Cricket
Sports News

More Telugu News