Armand Duplantis: పారిస్ ఒలింపిక్స్ కు ముందు ప్రకంపనలు సృష్టిస్తున్న స్వీడన్ పోల్ వాల్టర్... మరోసారి వరల్డ్ రికార్డు బద్దలు

  • చైనాలోని ఝియామెన్ లో డైమండ్ లీగ్ అథ్లెటిక్ పోటీలు
  • పోల్ వాల్ట్ క్రీడాంశంలో 6.24 మీటర్లతో అర్మాండ్ డుప్లాంటిస్ వరల్డ్ రికార్డు
  • గతంలో తన పేరిట ఉన్న 6.23 మీటర్ల రికార్డును తిరగరాసిన స్వీడన్ అథ్లెట్
  • ఇప్పటివరకు ఎనిమిదిసార్లు వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన డుప్లాంటిస్ 
Sweden athlet Armand Duplantis broke Pole Vault world record for 8th time

పోల్ వాల్ట్ క్రీడాంశంలో తన పేరిట వరల్డ్ రికార్డును లిఖించుకున్న స్వీడన్ అథ్లెట్ అర్మాండ్ డుప్లాంటిస్ తాజాగా తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. చైనాలోని ఝియామెన్ లో జరిగిన ఈ సీజన్ తొలి డైమండ్ లీగ్ లో అర్మాండ్ డుప్లాంటిస్ పోల్ వాల్ట్ లో 6.24 మీటర్లతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. 

గత సెప్టెంబరులో యూజీన్ లో జరిగిన డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ పోటీల్లో తన పేరిట ఉన్న 6.23 మీటర్ల వరల్డ్ రికార్డును డుప్లాంటిస్ నేడు సవరించాడు. తద్వారా, ఈ ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ కు ముందు ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. 

24 ఏళ్ల డుప్లాంటిస్ కు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.

More Telugu News