Dinosaur: దేవదేవుడు శివుడి పేరిట.. అతిపెద్ద డైనోసార్‌!

  • అర్జెంటీనాలో శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు
  • పొడవు 30 మీటర్లు, బరువు 74 టన్నులు ఉండేదని అంచనా
  • పొడవైన మెడతో కూడిన శాఖాహార సారోపాడ్‌ల జాతికి చెందినదిగా గుర్తింపు
enormous dinosaur dubbed shiva the Hindu god

శివుడు లయకారకుడు.. సృష్టిలో పాపం పెరిగినప్పుడు అంతా నాశనం చేసేసి.. మళ్లీ నిర్మించేందుకు వీలు కల్పించేవాడు. అంత పవర్‌ ఫుల్‌ కాబట్టే.. శాస్త్రవేత్తలు ఓ అతి పెద్ద డైనోసార్‌కు శివుడి పేరు పెట్టారు. ఇంతకీ ఆ డైనోసార్‌ ఏంటి? ఎక్కడ గుర్తించారు? దాని విశేషాలేమిటో చూద్దామా.. 

శిలాజాలపై పరిశోధన చేస్తూ..
అర్జెంటీనాలో శాస్త్రవేత్తలు కొన్నేళ్ల కింద అతి భారీ డైనోసార్‌ శిలాజాలను గుర్తించారు. దానిపై లోతుగా పరిశోధన చేసి.. అది ఇప్పటివరకు గుర్తించిన అన్ని డైనోసార్లకన్నా పెద్దది అని తేల్చారు. సారోపాడ్‌ డైనోసార్ల జాతికి చెందిన ఉప జాతిగా గుర్తించి.. దానికంటూ ప్రత్యేకంగా ‘బస్టింగోరీటైటాన్‌ శివ’ అని పేరుపెట్టారు.

శాఖాహార డైనోసారే..
సాధారణంగా డైనోసార్లంటిలో సారోపాడ్‌ జాతివి అతి భారీగా ఉంటాయి. అవి శాఖాహారులు. పెద్ద చెట్ల పైభాగంలోని చిటారు కొమ్మలను ఆహారంగా తీసుకుంటాయి. అందుకే వాటి మెడలు జిరాఫీలా సాగదీసినట్టు చాలా పొడవుగా ఉంటాయి. ‘శివ’ డైనోసార్‌ కూడా అలాగే ఉంటుంది.
ఇవి సుమారు 9 కోట్ల ఏళ్ల కింద జీవించాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏకంగా 98 అడుగుల (30 మీటర్ల) పొడవుతో.. 74 టన్నుల బరువు ఉండేవని అంటున్నారు.

ఇంతకీ ఈ పేరెందుకు పెట్టారు?
హిందూ పురాణాల్లోని శివుడి నుంచి స్ఫూర్తి పొంది ఈ భారీ డైనోసార్‌కు పేరు పెట్టామని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మరియా సిమోన్‌ చెప్పారు. ఇక ఈ భారీ డైనోసార్‌ శిలాజాలు మాన్యుయేల్‌ బస్టింగోరీ అనే రైతు పొలంలో దొరికాయి. తొలుత ఆ రైతు ఓ పెద్ద ఎముక శిలాజాన్ని గుర్తించి శాస్త్రవేత్తలకు సమాచారం ఇచ్చారు. తర్వాత శాస్త్రవేత్తలు విస్తృతంగా తవ్వకాలు చేపట్టి.. ‘శివ’ డైనోసార్‌ ను గుర్తించారు. అందుకే ఆ రైతు పేరు, శివుడి పేరు కలిపి ‘బస్టింగోరీటైటాన్‌ శివ’ అని పేరుపెట్టినట్టు సిమోన్‌ వెల్లడించారు. ఇందులో టైటాన్‌ అంటే అతి గొప్పది అని అర్థమట.

  • Loading...

More Telugu News