Uber: భారత సంతతి మహిళపై ఊబెర్ నిషేధం.. చివరకు క్షమాపణలు

Uber apologises to Swastika Chandra who was banned from app over her name
  • స్వస్తిక పేరున్న మహిళ అకౌంట్‌పై ఊబెర్ నిషేధం
  • హిట్లర్‌కు సంబంధించిన పదంగా పొరపాటు పడ్డ ఊబెర్
  • హిందూమతంలో స్వస్తిక ప్రాముఖ్యం గురించి వివరించిన మహిళ
  • చివరకు మహిళ అకౌంట్‌ను పునరుద్ధరించిన ఊబెర్

స్వస్తిక పేరున్న మహిళ అకౌంట్‌పై నిషేధం విధించిన ఊబెర్ చివరకు తన తప్పు తెలుసుకుని బాధితురాలికి క్షమాపణలు చెప్పింది. ఆస్ట్రేలియాలో ఈ ఘటన వెలుగు చూసింది.  ఫీజీలో పుట్టి పెరిగిన స్వస్తిక చంద్ర ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటోంది. గతేడాది అక్టోబర్‌లో ఆమె ఊబెర్ ఈట్స్ ద్వారా ఫుడ్ ఆర్డరిచ్చేందుకు ప్రయత్నించింది. అయితే, స్వస్తిక పేరు కారణంగా ఆమె ఆర్డర్ తీసుకునేందుకు యాప్ తిరస్కరించింది. పేరు మార్చాలని పేర్కొంది. చివరకు ఆమె అకౌంట్‌పై నిషేధం విధించింది.

దీంతో స్వస్తిక చంద్ర తన పోరాటం ప్రారంభించింది. ఆస్ట్రేలియాలో వివిధ హిందూ సంస్థల ద్వారా స్వస్తిక పేరుకు హిందూ సంప్రదాయంలో ఉన్న ప్రాముఖ్యతను పేర్కొంది. మహిళ ప్రయత్నాలు ఫలించడంతో క్షమాపణలు చెప్పిన ఊబెర్ ఆమె అకౌంట్‌ను పునరుద్ధరించింది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ మతానికి చెందిన పదాన్ని హిట్లర్ 1920ల్లో తనకు అనుకూలంగా మార్చుకున్నాడని స్వస్తిక స్థానిక మీడియాకు తెలిపింది. ‘‘హిట్లర్ ఆ పదాన్ని దుర్వినియోగ పరచకముందు వేల ఏళ్లుగా స్వస్తిక పేరును హిందువులు వాడుతున్నారన్న విషయం వాళ్లకు తెలియదు’’ అని స్వస్తిక చంద్ర చెప్పింది.

  • Loading...

More Telugu News