6 నెలల గర్భిణీని మంచానికి కట్టేసి నిప్పంటించిన భర్త
- పంజాబ్‌లో వెలుగుచూసిన దారుణ ఘటన
- తీవ్ర వాగ్వాదం.. క్షణికావేశంతో ఘోరానికి పాల్పడ్డ నిందితుడు
- మరో మూడు నెలల్లో కవలలకు జన్మనివ్వాల్సిన సమయంలో జరిగిన ఘోరం
సుఖ్‌దేవ్, పింకీల మధ్య విభేదాలు ఉన్నాయని, పలు విషయాలపై గొడవ పడేవారని పోలీసు అధికారులు చెప్పారు. శుక్రవారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, దారుణానికి ఒడిగట్టి సుఖ్‌దేవ్ పరారయ్యాడని అధికారులు వివరించారు. శనివారం సాయంత్రం సుఖ్‌దేవ్‌ని అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
కాగా ఈ దారుణ ఘటనపై నివేదిక ఇవ్వాలని పంజాబ్ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ కోరింది. ఈ ఘటనపై కమిషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఊహించలేని క్రూరత్వం ఇదని అభివర్ణించింది. ఈ ఘటనపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని పంజాబ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖ శర్మ లేఖ రాశారు. నేరస్థుడిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జాతీయ మహిళ కమిషన్ ‘ఎక్స్’ వేదికగా వివరాలను వెల్లడించింది.