Delhi Liquor Scam: తీహార్ జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖ విడుదల

  • ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు సంబంధించి కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని లేఖ
  • కవిత, సత్యేంద్ర జైన్, కేజ్రీవాల్, తనకు మధ్య జరిగిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను జత చేస్తున్నట్లు వెల్లడి
  • నగదును తాను ఢిల్లీ, గోవాలకు బదిలీ చేసినట్లు వివరణ 

తీహార్ జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖ రాశాడు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు సంబంధించి కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ మేరకు కవిత, సత్యేంద్ర జైన్, కేజ్రీవాల్, తనకు మధ్య జరిగిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను కూడా జత చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

సత్యేంద్ర జైన్ సూచనల మేరకు హైదరాబాద్‌లోని తన సిబ్బంది కవిత నుంచి సేకరించిన లావాదేవీలకు సంబంధించిన చాట్‌లు కూడా ఉన్నాయని లేఖలో పేర్కొన్నాడు. అదే నగదును తాను ఢిల్లీ, గోవాలకు బదిలీ చేసినట్లు తెలిపాడు. నెయ్యి టిన్‌గా చాట్‌లో వివరాలు కోడ్ చేయబడ్డాయని, నెయ్యి టిన్ అంటే కోటి రూపాయలకు సమానమని ఆ లేఖలో సుఖేశ్ పేర్కొన్నాడు.

More Telugu News