YS Sharmila: అన్న‌, వ‌దిన‌ల వ‌ద్ద ష‌ర్మిల తీసుకున్న అప్పు ఎంతంటే..!

  • అన్న జ‌గ‌న్ వ‌ద్ద రూ. 82. 58 కోట్లు.. వ‌దిన భార‌తిరెడ్డి వ‌ద్ద రూ. 19.56 లక్ష‌లు అప్పు ఉన్న‌ట్లు వెల్ల‌డి
  • త‌న మొత్తం ఆస్తుల విలువ‌ రూ. 182.82 కోట్లుగా పేర్కొన్న ఏపీసీసీ చీఫ్
  • ఇందులో చరాస్తులు రూ. 123. 26 కోట్లు
  • అలాగే ఆమె స్థిరాస్తులు 9.29 కోట్లు
  • ష‌ర్మిల‌పై ఎనిమిది కేసులు
APCC Chief YS Sharmila Affidavit Details

ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల శ‌నివారం క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె త‌న ఆస్తుల వివ‌రాల‌ను ప్రక‌టించారు. గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ష‌ర్మిల త‌న‌ ఆస్తులు ప్రకటించలేదు. తొలిసారి ఆస్తుల వివ‌రాలు వెల్లడించారు. 

షర్మిల త‌న మొత్తం ఆస్తుల విలువ‌ రూ. 182.82 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో చరాస్తులు రూ. 123. 26 కోట్లుగా ప్ర‌క‌టించారు. ఆమె భ‌ర్త అనిల్ కుమార్ రూ. 45 కోట్ల చ‌రాస్తుల‌ను క‌లిగి ఉన్నారు. అలాగే ఆమె స్థిరాస్తులు 9.29 కోట్లుగా తెలిపారు. భ‌ర్తకు రూ. 4.05 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ష‌ర్మిల వ‌ద్ద 3.69 కోట్ల విలువైన బంగారం, రూ. 4.61 కోట్లు విలువ చేసే జెమ్ స్టోన్స్ ఆభ‌ర‌ణాలు ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

ఇక అన్న జ‌గ‌న్ వ‌ద్ద రూ. 82. 58 కోట్లు, వ‌దిన వైఎస్ భార‌తిరెడ్డి వ‌ద్ద రూ. 19.56 లక్ష‌లు అప్పు తీసుకున్న‌ట్లు అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. అలాగే ఆమెపై ఎనిమిది కేసులు ఉన్నాయి. షర్మిలకు ఏడాదికి ఆదాయం  రూ. 97.14 లక్ష‌లు వస్తుందని అఫిడవిట్‌లో తెలిపారు. అలాగే ఆమె భర్త అనిల్ కుమార్ ఆదాయం రూ. 3 ల‌క్ష‌లు మాత్రమేనని తెలిపారు.

  • Loading...

More Telugu News