Chandrababu: చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

PM Modi conveys birthday wishes to NDA ally Chandrababu
  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • టీడీపీ అధినేతపై శుభాకాంక్షల వెల్లువ 
  • ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసే నేత అంటూ కొనియాడిన మోదీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబుకు విషెస్ తెలియజేశారు. 

"ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అంకితభావంతో కృషి చేసే అనుభవజ్ఞుడైన నాయకుడు. ప్రజాసేవలో నిమగ్నమైన ఆయన దీర్ఘాయుష్కుడై, ఆరోగ్యవంతుడై జీవించాలని ప్రార్థిస్తున్నాను" అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Chandrababu
Birthday
Narendra Modi
Wishes
NDA
BJP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News