Pakistan: ఒకే కాన్పులో ఆరుగురు పిల్ల‌లకు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌!

Woman Gives Birth to Six Babies in Rawalpindi
  • పాకిస్థాన్‌లోని రావ‌ల్పిండిలో ఘ‌ట‌న‌
  • జీన‌త్ వాహీద్‌ అనే మ‌హిళకు ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డ‌లు
  • న‌వ‌జాత శిశువుల్లో న‌లుగురు మ‌గ‌, ఇద్ద‌రు ఆడపిల్ల‌లు

పాకిస్థాన్‌లో అరుదైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. సాధారణంగా ఒకే కాన్పులో కవలలు జన్మించ‌డం కామ‌న్‌. కొన్ని సందర్భాల్లో ఇద్దరికంటే ఎక్కువ మంది శిశువులు జన్మిస్తుంటారు. అయితే, రావ‌ల్పిండికి చెందిన జీన‌త్ వాహీద్‌ అనే మ‌హిళ ఒకే కాన్పులో ఆరుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. న‌వ‌జాత శిశువుల్లో న‌లుగురు మ‌గ‌, ఇద్ద‌రు ఆడపిల్ల‌లు ఉన్నారు. 

తల్లీబిడ్డ‌లు ఆరోగ్యంగా ఉన్నార‌ని వైద్యులు వెల్ల‌డించారు. అలాగే శిశువుల శ‌రీర బ‌రువు కూడా సాధార‌ణంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఇక సెక్స్‌టప్లెట్స్ వివిధ ర‌కాలు. ఆరు వేర్వేరు అండాలు, స్పెర్మ్ కలయికల నుండి వచ్చేవి ఒక ర‌క‌మైన‌వి కాగా. అలాగే ఒకే ఫలదీకరణ అండం బహుళ పిండాలుగా విడిపోయినప్పుడు వ‌చ్చే సెక్స్‌టప్లెట్స్ మ‌రో రకానికి చెందిన‌విగా వైద్య నిపుణులు పేర్కొన‌డం జ‌రుగుతుంది.

  • Loading...

More Telugu News