RaghuramaKrishna Raju: ఉండి నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్ఠానం ఆదేశించింది: రఘురామ కృష్ణరాజు

Nomination on 22nd From Undi as TDP Candidate says RaghuramaKrishna Raju
  • టీడీపీ అభ్యర్థిగా 22న నామినేషన్‌ వేస్తానని ప్రకటన
  • ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తానని ప్రకటన
  • ఈ రోజు టీడీపీ బీఫామ్‌ను అందుకోనున్న రఘురాజు    
టీడీపీ నేత రఘురామకృష్ణరాజు పోటీపై స్పష్టత వచ్చింది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్ఠానం తనను ఆదేశించిందని ఆయన ప్రకటించారు. పార్టీ బీఫాం అందుకుంటానని, ఈ నెల 22న నామినేషన్‌ దాఖలు చేస్తానని ఆయన వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఉండి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తానని రఘురామకృష్ణరాజు తెలిపారు. దీంతో  ఈ రోజు (శనివారం) ఉండి నియోజకవర్గ టీడీపీ బీఫామ్‌ను ఆయన అందుకోనున్నారు.

కాగా నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారంటూ శుక్రవారం సాయంత్రమే వార్తలు వెలువడ్డాయి. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి.
RaghuramaKrishna Raju
Telugudesam
AP Assembly Polls
TDP
Andhra Pradesh

More Telugu News