Narendra Modi: మాటలు రాక ప్రసంగాన్ని ఆపేసిన మోదీ.. కారణం ఇదే!

Modi gets emotional after seeing his mother photo
  • మధ్యప్రదేశ్ లో ఎన్నికల సభలో పాల్గొన్న మోదీ
  • మోదీ, హీరాబెన్ ఫొటోను ప్రదర్శించిన యువకుడు
  • తీవ్ర భావోద్వేగానికి గురైన మోదీ

తన తల్లిని తలుచుకుని ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఉదయం ఉత్తరప్రదేశ్ లో పర్యటించిన ఆయన... ఆ తర్వాత మధ్యప్రదేశ్ కు చేరుకున్నారు. మధ్యప్రదేశ్ లోని దమోహ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యువకుడు తీసుకొచ్చిన ఫొటోను చూసి మోదీ భావోద్వేగానికి గురయ్యారు. 

మోదీ ప్రసంగిస్తుండగా ఒక యువకుడు చేతిలో ఫొటో ఫ్రేమ్ కనిపించింది. ఆ ఫొటో మోదీ మాతృమూర్తి హీరాబెన్ ది. మోదీని ఆమె ఆశీర్వదిస్తుండగా తీసిన ఫోటో అది. పెన్సిల్ తో గీసిన ఆ చిత్రాన్ని చూసి మోదీ ఎమోషనల్ అయ్యారు. మాటలు రాక కాసేపు ప్రసంగాన్ని ఆపేశారు. ఆ చిత్రాన్ని తెచ్చిన యువకుడిని అభినందించారు. ఆ ఫొటో వెనుక అతని పేరు, చిరునామాను రాసివ్వాలని సూచించారు. తాను లేఖ రాస్తానని చెప్పారు. 2022 డిసెంబర్ 30న హీరాబెన్ 100 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

  • Loading...

More Telugu News