Pawan Kalyan: సీఎం జగన్ పై సీఈవోకు ఫిర్యాదు చేసిన జనసేన నేతలు

Janasena leaders complains on CM Jagan
  • ఈ నెల 16న భీమవరంలో మేమంతా సిద్ధం సభ
  • పవన్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేతల ఫిర్యాదు
  • పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారని ఫిర్యాదు
  • రాష్ట్రంలోని మహిళలను కించపరిచేలా జగన్ మాట్లాడారన్న జనసేన నేతలు 

ఏపీ సీఎం జగన్ పై జనసేన నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న భీమవరం సభలో పవన్ కల్యాణ్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారని ఆరోపించారు. 

జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికే వస్తాయని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మహిళలను కించపరిచేలా జగన్ మాట్లాడారని జనసేన నేతలు తమ ఫిర్యాదులో వివరించారు. సానుభూతితో గెలిచేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News