Wedding Card: సింప్లీ సూప‌ర్బ్‌.. సీఎస్‌కే థీమ్‌తో పెళ్లి ప‌త్రిక‌!

Chennai Super Kings Fan make a CSK Theme Wedding Card goes Viral on Social Media
  • పెళ్లి ప‌త్రిక విష‌యంలో సీఎస్‌కే అభిమాని క్రియేటివిటీ
  • ఆహ్వాన ప‌త్రిక‌లో సీఎస్‌కే లోగోతో వ‌ధూవ‌రుల పేర్లు
  • అలాగే మ్యాచ్ న‌మూనా టికెట్‌పై పెళ్లి స‌మ‌యం, రిసెప్ష‌న్ వంటి వివ‌రాలు
  • నెట్టింట వైర‌ల్ అవుతున్న సీఎస్‌కే థీమ్‌ పెళ్లి ప‌త్రిక‌
ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమాన‌గ‌ణం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అందులోనూ ఆ జ‌ట్టు మాజీ సారధి మ‌హేంద్ర సింగ్ ధోనీ అంటే సీఎస్‌కే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. చెన్నై మ్యాచ్ ఉందంటే చాలు.. త‌మ జ‌ట్టుకు స‌పోర్ట్ గా భారీ సంఖ్య‌లో త‌ర‌లి వెళ్తుంటారు. తాజాగా ఓ సీఎస్‌కే అభిమాని త‌న పెళ్లి ప‌త్రిక విష‌యంలో చూపించిన క్రియేటివిటీ ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌కు దారితీసింది. 

త‌మిళ‌నాడుకు చెందిన జంట చెన్నై సూప‌ర్ కింగ్స్ థీమ్‌తో పెళ్లి ప‌త్రిక రూపొందించింది. ఆహ్వాన ప‌త్రిక‌లో సీఎస్‌కే లోగోను ఉప‌యోగించి వారి పేర్ల‌ను ముద్రించారు. అలాగే మ్యాచ్ న‌మూనా టికెట్‌పై పెళ్లి స‌మ‌యం, రిసెప్ష‌న్ వంటి వివ‌రాల‌ను తెలియ‌జేశారు. 

క్రియేటివిటీ ఉప‌యోగించి మ్యాచ్ ప్రివ్యూ, మ్యాచ్ ప్రిడిక్ష‌న్ వంటి ప‌దాల‌తో త‌మ ప్రేమ‌ను వివ‌రించారు. దాంతో ప్ర‌స్తుతం ఈ వివాహ ఆహ్వాన ప‌త్రిక సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.
Wedding Card
Chennai Super Kings
CSK
Social Media
IPL 2024

More Telugu News