Kasthuri: మహేశ్ బాబు వయసు.. నా వయసు ఒకటే: కస్తూరి

My age and Mahesh Babu age is same says Kasthuri

  • వయసు పెరగడం లేదని బాధ పడుతున్న కస్తూరి
  • మదర్ క్యారెక్టర్లు చేయలేపోతున్నానని ఆవేదన
  • యంగ్ గా కనిపిస్తుండటంతో తల్లి పాత్రలు రావడం లేదన్న కస్తూరి

సినీ నటి కస్తూరి గురించి ఎలాంటి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె... ప్రస్తుతం టీవీ సీరియల్స్ తో బిజీగా ఉంది. మరోవైపు తనకు వయసు పెరగడం లేదని ఆమె తెగ బాధ పడిపోతోంది. వయసు పెరగక పోవడం వల్ల తాను ఎన్నో ఆఫర్స్ కోల్పోతున్నానని ఆమె తెలిపింది. 

కల్యాణ్ రామ్ సినిమా 'డెవిల్'లో తనకు ఆఫర్ వచ్చిందని... సీత చేసిన తల్లి పాత్ర తాను చేయాల్సిందని... అయితే, తాను యంగ్ గా కనిపిస్తున్నానని తనను తీసేశారని చెప్పింది. రజనీకాంత్ 'కాలా' చిత్రంలో కూడా తాను నటించాల్సి ఉందని... అయితే రజనీ పక్కన పిల్లలకు తల్లిగా తాను సెట్ కానని తీసేశారని తెలిపింది. ఆ పాత్రలో ఈశ్వరీరావు నటించారని... ఆ తర్వాత ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తాయని చెప్పారు. వయసు పెరుగుతోందని అందరూ బాధ పడతారని.. కానీ, తాను వయసు పెరగడం లేదని బాధపడుతున్నానని అన్నారు. తాను యంగ్ గానే కనిపిస్తానని... తన ఫేస్ అలాంటిదని చెప్పింది.   

తాను జుట్టుకు రంగు కూడా వేయనని కస్తూరి తెలిపింది. ఇప్పటికిప్పుడు మదర్ క్యారెక్టర్లను వేయలేనని చెప్పింది. మహేశ్ బాబు వయసు, తన వయసు ఒకటేనని... అలాంటప్పుడు ఆయనకు తల్లిగా తాను ఎలా నటించగలనని ప్రశ్నించింది. మహేశ్, కస్తూరి మధ్య ఒక ఏడాది వయసు తేడా ఉంది. మహేశ్ కంటే కస్తూరి ఒక ఏడాది పెద్దది.

More Telugu News