YS Vijayamma: హ్యాపీ బర్త్ డే అమ్మా: జగన్, షర్మిల

Jagan and Sharmila birthday greetings to YS Vijayamma
  • నేడు వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు
  • జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్, షర్మిల
  • ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయమ్మ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ జన్మదినం నేడు. ఈ సందర్భంగా తన తల్లికి జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'హ్యాపీ బర్త్ డే అమ్మా' అని ట్వీట్ చేశారు. ఓ కార్యక్రమంలో తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. 

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి, ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనఃశాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ.. హ్యాపీ బర్త్ డే మా' అని ట్వీట్ చేశారు. 

మరోవైపు విజయమ్మ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. యూఎస్ లో ఉంటున్న తన మనవడు రాజారెడ్డి (షర్మిల కుమారుడు) వద్దకు ఆమె వెళ్లారు. ఇటీవలే రాజారెడ్డి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగింది.
YS Vijayamma
YS Jagan
YSRCP
YS Sharmila
Congress
Birthday

More Telugu News