Ambati Murali: వైసీపీ అభ్యర్థి అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఈసీ ఆదేశం

SEC orders to take action against Ponnuru YSRCP candidate Ambati Murali
  • సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళి
  • ఎన్నికల సంఘానికి టీడీపీ నేతల ఫిర్యాదు
  • మురళి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టు నిర్ధారించిన అధికారులు
పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, పొన్నూరు మండలం ములుకుదురులో అంబటి మురళి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు అంబటి మురళి కోడ్ ను ఉల్లంఘించినట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అంబటి మురళిపై చర్యలకు ఎన్నికల సంఘం ఆదేశించింది.
Ambati Murali
YSRCP
EC
Election Code

More Telugu News