Vice Admiral Dinesh Tripathi: భారత నావికాదళాధిపతిగా దినేశ్ త్రిపాఠి

Vice Admiral Dinesh Tripathi appointed next Navy Chief

  • తదుపరి నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ నియామకం 
  • గురువారం రాత్రి ప్రకటన విడుదల చేసిన కేంద్రం
  • ఏప్రిల్ 30న రిటైర్ కానున్న ప్రస్తుత నేవీ చీఫ్ ఆర్.హరికుమార్

భారత తదుపరి నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠిని కేంద్రం నియమించింది. ప్రస్తుతం వైస్ చీఫ్‌గా ఆయనను చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. 

1964 మే 15న జన్మించిన వైస్ అడ్మిరల్ త్రిపాఠి 1985 జులై 1న నేవీలోని ఎగ్జిక్యూటివ్ విభాగంలో తన ప్రయాణం ప్రారంభించారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ యుద్ధరీతుల నిపుణుడైన త్రిపాఠి తన 39 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. వైస్ అడ్మిరల్ కాకమునుపు ఆయన వెస్ట్రన్ కమాండ్‌ అధిపతిగా, ఫ్లాగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. రేవాలోని సైనిక్ స్కూల్, ఖడక్వసాలాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్న ఆయన వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ, నేవల్ వార్ కాలేజీ (గోవా), యూఎస్ నేవల్ కాలేజీలల్లో పలు కోర్సులు చేశారు.

  • Loading...

More Telugu News