Gottipati Lakshmi: శస్త్రచికిత్స చేసి తల్లీబిడ్డలను కాపాడిన టీడీపీ దర్శి అభ్యర్థి డా.లక్ష్మి

TDP alliance candidate peforms emergency surgery saves mother and infant

  • దర్శిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు
  • అత్యవసరంగా ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను కాపాడిన డా.గొట్టిపాటి లక్ష్మి
  • ఆసుపత్రి వైద్యురాలు సుదూరాన ఉండటంతో తనే స్వయంగా ఆపరేషన్ చేసిన వైనం

అత్యవసర సమయంలో ఓ గర్భిణికి శస్త్రచికిత్స చేసి తల్లీబిడ్డలను కాపాడారు దర్శి టీడీపీ కూటమి అభ్యర్థి డా.లక్ష్మి. దర్శి మండలం అబ్బాయిపాలేనికి చెందిన వెంకట రమణ గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను దర్శిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో శస్త్రచికిత్స అవసరమని వైద్య సిబ్బంది భావించారు. అప్పటికి ఆసుపత్రి వైద్యురాలు చాలా దూరంలో ఉన్నారు. 

మరోవైపు ఆసుపత్రికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనే దర్శి టీడీపీ కూటమి అభ్యర్థి డా.గొట్టిపాటి లక్ష్మి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది గర్భిణి పరిస్థితి గురించి డా. లక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. గైనకాలజిస్టయిన డా. లక్ష్మి వెంటనే స్పందించారు. ఆసుపత్రికి చేరుకుని గర్భిణికి శస్త్రచికిత్స చేసి తల్లీబిడ్డలను కాపాడారు. దీంతో, మహిళ బంధువులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Gottipati Lakshmi
TDP-JanaSena-BJP Alliance
Darsi
  • Loading...

More Telugu News