Youtuber Arrest: యూట్యూబర్ అరెస్ట్.. కంట్రోల్ లో ఉండాలి మరి!

  • బెంగళూరు ఎయిర్ పోర్టులో వీడియో
  • తనను ఎవరూ పట్టుకోలేదని గొప్పలు
  • అరెస్ట్ చేసిన పోలీసులు
Youtuber arrested for video in Bengaluru airport

సోషల్ మీడియా అంటేనే ఫేక్ వార్తలకు భాండాగారం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వార్తలను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తుంటారు. ఇక యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్లు ఇష్టం వచ్చినట్టు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు. నిషేధిత ప్రాంతాల్లో వీడియోలు తీస్తూ వాటిని షేర్ చేస్తున్నారు. ఇలాంటి యూట్యూబర్లపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. తాజాగా నిషిద్ధ ప్రాంతం గురించి ప్రచారం చేసిన ఒక యూట్యూబర్ ను బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే... బెంగళూరు యలహంకకు చెందిన వికాస్ గౌడ ఈ నెల 7న మధ్యాహ్నం 12.06 గంటల సమయంలో బెంగళూరు - చెన్నై టికెట్ కొని ఎయిర్ పోర్టులోకి వెళ్లాడు. అయితే, విమానం ఎక్కకుండా ఎయిర్ పోర్టు పరిసరాల్లో తిరుగుతూ... వీడియో రికార్డింగ్ చేశాడు. ఆ వీడియోను ఏప్రిల్ 12న తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు... ఎయిర్ పోర్ట్ మొత్తం తిరిగినా... తనను ఎవరూ పట్టుకోలేదని గొప్పగా చెప్పుకున్నాడు. ఎయిర్ పోర్ట్ లో భద్రత గురించి నెగెటివ్ గా కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ వింగ్ అయిన సీఐఎస్ఎఫ్ ఆయనపై ఫిర్యాదు చేసింది. వికాస్ గౌడపై ఐపీసీ సెక్షన్లు 505, 448 కింద కేసు నమోదయింది. వికాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News