వైఎస్ జగన్ ఆస్తుల కేసు: సీబీఐ కోర్టులో మరోసారి విచారణ వాయిదా
- నాంపల్లి సీబీఐ కోర్టులో సీఎం జగన్ ఆస్తుల కేసుల విచారణ
- జగన్, ఇతర నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై విచారణ
- తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా
మరోవైపు, జగన్ ఆస్తుల కేసులో ట్రయల్ నత్తనడకన నడస్తుండడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే సీబీఐని ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో విచారణలో జాప్యం చేయరాదని, సీఎం అన్న కారణంగానే విచారణ ఆలస్యమవుతోందన్న వాదనకు ఏం జవాబు చెబుతారని సీబీఐని నిలదీసింది. సీఎం అయితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందా? అని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల విచారణలో ప్రశ్నించింది.