ShilpaShetty: శిల్పాశెట్టి ఇంటిని అటాచ్ చేసిన ఈడీ

Enforcement Directorate seizes ShilpaShetty properties worth Rs 98 Crores
  • మరికొన్ని స్థిర, చర ఆస్తులు కూడా..
  • పీఎంఎల్ఏ చట్టం కింద రూ.98 కోట్ల ఆస్తుల అటాచ్
  • రాజ్ కుంద్రాపై దాఖలైన కేసు విచారణలో భాగంగా నిర్ణయం
బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. ముంబైలోని జుహూ ఏరియాలో ఉన్న ఆమె ఫ్లాట్ ను అటాచ్ చేశారు. దీంతో పాటు పూణెలో ఓ బంగ్లా సహా రూ.98 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గురువారం అటాచ్ చేస్తూ నోటీసులు ఇచ్చారు. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై నమోదైన బిట్ కాయిన్ పోంజి స్కామ్ కేసు దర్యాఫ్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈడీ అధికారులు అటాచ్ చేసిన ఆస్తుల్లో జుహూలోని రెసిడెన్షియల్ ఫ్లాట్ తోపాటు పూణెలో శిల్పాశెట్టి పేరు మీద ఉన్న ఓ బంగ్లా, రాజ్ కుంద్రా పేరిట ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి. ప్రివిన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) 2002 కింద అధికారులు ఈ అటాచ్ నోటీసులు జారీ చేశారు.

పోర్న్ రాకెట్ కేసులో కుంద్రా..
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతులను బలవంతంగా పోర్న్ వీడియోల్లో నటింపజేశాడని రాజ్ కుంద్రాపై పోలీసులు గతంలో కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణం కూడా ఉందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసులోకి ఎంటరయ్యారు. కేసు దర్యాఫ్తులో భాగంగా.. రాజ్ కుంద్రా తన పేరుమీద ఉన్న విలువైన ఆస్తులను భార్య శిల్పాశెట్టి పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు గుర్తించారు.
ShilpaShetty
properties Attach
Enforcement Directorate
Juhu Flat
Rajkundra
Porn Rocket

More Telugu News